- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
పితృదోషాల నుంచి విముక్తి కోసం ఆదివారం వెద్దల అమావ్యాస సందర్భంగా కామారెడ్డి లోని శ్రీశనైశ్వరాలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు విశేషపూజలు నిర్వహించారు. శనైశ్వరస్వామికి ఇష్టమైన 19 ప్రదక్షణలు చేసి నువ్వుల తైలంతో అభిషేకం నిర్వహించారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయ కమిటీ తరపున ఉచితంగా నువ్వుల తైలం, పూజ ద్రవ్యాలను అందిస్తున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు లింగాగౌడ్, రవీందర్రెడ్డి, యాద అనిల్ కుమార్ , పాత ధర్మారాజు లు తెలిపారు. అనంతరం పెద్దల కోసం అర్చకులకు సాహిత్య దానం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో పితృదేవతలకు బియ్యం కూరగాయలు డబ్బులను గ్రామాలలో గల జంగమాలకు దానం చేశారు.
- Advertisement -