పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచన, స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘మా చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ వేడుకకు ప్రజా సేవలో ఎంతో బిజీగా ఉండి కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. మా నాయకుల నిబద్ధతను ప్రేరణగా తీసుకొని, ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం ఎన్నో హిట్ సినిమాలు వస్తున్నాయి.
వాటి కోవలోనే మా చిత్రమూ ఉంటుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఇండిస్టీలో ఎంతో కష్టపడి ఎదగాలని వచ్చిన నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు’ అని నటుడు అభినవ్ శౌర్య చెప్పారు. మరో నటుడు నరసింహ మాట్లాడుతూ,’ ఈ సినిమా కోసం దర్శక, నిర్మాత రామకృష్ణారెడ్డి ఎంతగానో కష్టపడ్డారు. కేవలం ఆయన డెడికేషన్ వల్ల సినిమా ఈ స్థాయిలో వచ్చింది’ అని తెలిపారు. అనుశ్రీ మాట్లాడుతూ, ‘నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అన్నారు. ”దేవగుడి’ అనేది ఎంత పవర్‌ఫుల్ టైటిలో, ఈ సినిమాలో కూడా ఎమోషన్ అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. విజువల్‌గా ఈ సినిమా ఓ సరికొత్త ట్రీట్ ఇస్తుంది’ అని డిఓపి లక్ష్మీకాంత్ చెప్పారు.
హిట్ సినిమాల కోవలో..
- Advertisement -
- Advertisement -