Monday, September 22, 2025
E-PAPER
Homeసినిమాఘనంగా 'మనం సైతం' పుష్కర మహోత్సవం

ఘనంగా ‘మనం సైతం’ పుష్కర మహోత్సవం

- Advertisement -

నటుడు కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్‌ పుష్కర మహోత్సవం ఆదివారం ఫిలింఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్‌ మాట్లాడుతూ, ‘సీనియర్‌ జర్నలిస్ట్‌ జి.కృష్ణ శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే సామాజిక సేవ ఆలోచన వచ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న ఈ సేవలో ఎందరో మహాను భావులు ఆశీర్వదించారు. మద్దతు తెలిపారు. వారందరి సహకారంతోనే ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నాం’ అని అన్నారు. ‘ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడు. కిరణ్‌కు దేవుడు మంచి మనసు ఇచ్చాడు’ అని సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పాడు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ, ‘కరోనా సమయంలో వందలాది కుటుంబాలకు కాదంబరి కిరణ్‌ సాయం చేశారు. కిరణ్‌ సేవలకు మా మద్దతు ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కాజా సూర్య నారాయణ, జర్నలిస్ట్‌లు సురేష్‌ కొండేటి, దేవులపల్లి అమర్‌, పృథ్వీ, సాయి, టీవీ5 మూర్తి, ఏఎన్‌ఎన్‌ ఛానల్‌ సీఈఓ కంది రామచంద్ర రెడ్డి, ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌, టి.రామసత్యనారాయణ, అశోక్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ రాఘవ, సాంబశివరావు, డీవీ రావు తదితరులు పాల్గొని ‘మనం సైతం’తో కాదంబరి కిరణ్‌ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -