కాగ్ రిపోర్టు
న్యూఢిల్లీ : 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు జీతాలు, పెన్షన్లు , వడ్డీ చెల్లింపులపై చేసిన నిబద్ధ వ్యయం 2.9 రెట్లు పెరిగి రూ.15,63,649 కోట్లకు చేరుకుంది. 2013-14లో ఈ వ్యయం రూ.6,26,849 కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదిక ఆదివారం ప్రకటించింది.2013-14 నుంచి 2022-23 వరకు పదేండ్ల కాలంలో, రాష్ట్రాల ఆదాయ వ్యయం మొత్తం వ్యయంలో 80-87శాతం ఉందని, ఇది మొత్తం జీఎస్‌డీపీ వ్యయంలో సుమారు 13-15 శాతం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయం మొత్తం జీఎస్‌డీపీలో 13.85శాతం అని భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్(కాగ్) ద్వారా 2022-23లో రాష్ట్ర ఆర్థిక ప్రచురణలో ఈ విషయం వెల్లడైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం ఆదాయ వ్యయం రూ.35,95,736 కోట్లలో నిబద్ధ వ్యయం రూ.15,63,649 కోట్లు, సబ్సిడీలపై రూ.3,09,625కోట్లు , గ్రాంట్స్ ఇన్ ఎయిడ్‌పై రూ.11,26,486 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఈ మూడు మొత్తం ఆదాయ వ్యయంలో 83శాతం కంటే ఎక్కువ అని తెలిపింది. 2013-14లో అన్ని రాష్ట్రాలకు రూ.96,479 కోట్లుగా ఉన్న సబ్సిడీపై ఖర్చు 2022-23లో రాష్ట్రాలకు రూ.3,09,625కోట్లకు పెరిగింది.2013-14 నుండి 2022-23 వరకు, రెవెన్యూ వ్యయం 2.66 రెట్లు, నిబద్ద వ్యయం 2.49 రెట్లు, సబ్సిడీ 3.21 రెట్లు పెరిగింది అని నివేదిక పేర్కొంది. 2022-23 వ్యయాల్లో జీతాలు అతిపెద్ద భాగంగా ఉన్నాయి, తరువాత పెన్షన్, వడ్డీ చెల్లింపులు ఉన్నాయి.
2.9 రెట్లు పెరిగిన రాష్ట్రాల వ్యయాలు
- Advertisement -
- Advertisement -