- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని మలక్ చించోలి లోని మల్లేశ్వరస్వామి (మల్లన్న), వేంకటేశ్వర స్వామి, మాతా అన్నపూర్ణ ఆలయంలో బీజేపీ పార్టీ మండల అద్యక్షులు ఆద్వర్యంలో నిర్మల్ ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచి మహేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణయ్య, గంగాధర్, రాజేశ్వర్, దయాకర్ రెడ్డి, అర్జున్, రమేష్, మనోహర్ రాజేశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -