నిధులు మంజూరైన గ్రౌండింగ్ కానీ నిధులు..
8 నెలలుగా పెండింగ్లోనే రూ.7.62 కోట్లు నిధులు..
ఆందోళనలో 254 మంది లబ్ధిదారులు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రెండవ విడత దళిత బంధు నిధులు మంజూరైనా, 8 నెలలుగా లబ్ధిదారులకు సంబంధిత అధికారులు గ్రౌండింగ్ చేయడంలో పూర్తిగా విఫలం చెందారని లబ్ధిదారుల ఆరోపిస్తున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు పరిధిలోని సుమారు 254 మంది లబ్ధిదారులు దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించడు చందంగా లబ్ధిదారుల పరిస్థితి తయారయింది. దళిత బంధు రెండో విడతకు సంబంధించి నిధులు జనవరి, 2025 లో విడుదలయ్యాయి. ఇంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. గత ఎనిమిది నెలలుగా అకౌంట్ ఫీజింగ్ లో ఉండడంతో లబ్ధిదారులు ఎవరిని అడగాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూరు , అడ్డగూడూరు పరిధిలోని సుమారు 254 మంది లబ్ధిదారులు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సైతం కలిసి వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు అందజేసిన అకౌంట్లు ఫ్రీజింగ్ లో ఉండటంతో లబ్ధిదారులు ఎవరితో మొరపెట్టుకోవాలి అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. ఇటీవలనే మోత్కూర్ లో అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలయ వేసి వినతిపత్రం సమర్పించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. రెండో విడత దళిత బంధు నిధులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గాలలో గ్రాండింగ్ పూర్తయ్యాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే లబ్ధిదారులకు రెండో విడత నిధులు విడుదల చేసి ఫ్రీజింగ్ ఎత్తివేసి గ్రౌండింగ్, పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
త్వరలోనే గ్రౌండ్ పూర్తి చేస్తాం… ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్
రెండో విడత దళిత బందుకు సంబంధించి 254 మంది లబ్ధిదారులకు సుమారుగా రూ.7 కోట్ల 62 లక్షలు అకౌంట్ లో ఉన్నాయని, త్వరలోనే గ్రౌండ్కి పూర్తి చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ తెలిపారు.