Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చీకట్లో బతుకమ్మ సంబరాలు.!

చీకట్లో బతుకమ్మ సంబరాలు.!

- Advertisement -

గ్రామాల్లో వెలుగని వీధి దీపాలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
జీపీల్లో నిధులు కొరత
నవతెలంగాణ – మల్హర్ రావు

గ్రామపంచాయతీల్లో నిధులు లేకపోవడంతో విధుల్లో వెలుగులు కరువైయ్యాయి.ఫలితంగా చిమ్మంచికట్లో మహిళలు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. అసలే వర్షాకాలం కావడంతో విష పురుగులు సమాచారం చేస్తున్న నేపథ్యంలో ఇందుకు తోడుగా విధుల్లో చికటిమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో బతుకమ్మ,దసరా పండుగలు చీకట్లో నిర్వహించుకునే పరిస్థితి నెలకొంది. అతి పెద్ద పండుగలైన బతుకమ్మ, దసర వేడుకలు ఆదివారం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో వీధిదీపాల ఏర్పాటు చేయడంలో ప్రభుత్వంతోపాటు, అధికారులు విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం క్రితం నుంచి జిపిల్లో పాలకవర్గాలు లేకపోవడంతో జిపిల అభివృద్ధిలో కుంటుబడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మండలంలో 3101 వీధి దీపాలు

మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 3101 వీధి దీపాలను కరెంట్ పోల్స్ పై జీపీ అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయలేదు. తాడిచర్లలో 576, మల్లారంలో 396, చిన్నతూండ్లలో 80, కొండంపేటలో 110, ఇప్పలపల్లిలో 95, అన్సాన్పల్లిలో 160, పెద్దతూండ్లలో 398, అడ్వాలపల్లిలో 120, దుబ్బపేటలో 50, కొయ్యూరు లో 210, వల్లెకుంటలో 226, మల్లoపల్లిలో 45, రుద్రారంలో 295, ఎడ్లపల్లిలో 160 దీపాలను బిగించాల్సి ఉంది.

నిర్వహణకు రూ.9 లక్షల ఖర్చు

మండల వ్యాప్తంగా 15 గ్రామ పంచాయతీల్లో 3101 ఎల్ ఈడీ లైట్ బిగించడానికి గ్రామ పంచాయతీలు రూ.9లక్షల మేర ఖర్చు చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమత మవుతున్నాయి. దీంతో కార్యదర్శులు గ్రామంలో లైట్లు బిగించడానికి ముందుకు రావడం లేదు. ఒక్క ఎల్డీ కొనుగొలు చేయాలంటే రూ.250 మేరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్క చిన్న గ్రామ పం చాయతీలకు రూ.30 వేల నుంచి రూ.50, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షల మేర ఖర్చుకానున్నట్లు తెలుస్తోం ది. నిధులు లేక పంచాయతీల్లో ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టని పరిస్థితి.

నిధులు సమకూర్చాలని వినతి..

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో గ్రామాల్లో వీధి దీపాలు లైట్లు బిగించడానికి నిధులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు ఈనెల 16న ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీరామ్మూర్తికి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత కారణంగా అభివృద్ధి పనులు చేయడానికి ఇబ్బందు లు పడుతున్నామని వినతిలో పేర్కొన్నారు. తాడిచర్ల ఓపెన్కాస్ట్ సీఎస్ఆర్ నిధులతో ఎస్ఈడీ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -