Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాడి రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..

పాడి రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..

- Advertisement -

కొల్లూరు రాజయ్య.. రైతు సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి

పాడి రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని హామీలన్నింటిని అమలు పరచాలన్నారు. ముఖ్యంగా నష్టాలలో ఉన్న మదర్ డైరీ ని ఆదుకుంటామని చెప్పినారని వెంటనే మదర్ డైరీ ని లాభాల బాటలో తీసుకురావడానికి కృషిచేసి 6 నెలల నుండి పెండింగ్లో ఉన్న పాల రైతులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  లీటర్కు 4 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని వాగ్దానం చేసినారని వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ చెక్క వెంకటేష్ మండల సిపిఐ కార్యదర్శి దాసరి లక్ష్మయ్య  పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -