నవతెలంగాణ – కంఠేశ్వర్
టిఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ ల ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టి కోర్ట్ స్పెషల్ పీపీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ ఆర్. దయాకర్ గౌడ్ కి టి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోనీ ఛాంబర్ లో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వీడిసి ఆగడాలు రోజురోజుకు మితిమీరి ఎస్సీ, ఎస్టీల పైన బీసీల పైన గ్రామ బహిష్కరణలు, దాడులు, హత్యలు జరుగుతున్న సందర్భంలో కులాంతర వివాహాలు చేసుకున్న దళితులపై దాడులు కుల బహిష్కరణ గ్రామ బహిష్కరణ జరుగుతున్న తరుణంలో వాటిని అరికట్టడం కోసం ఈరోజు దయాకర్ గౌడ్ కి బహుజన బిడ్డ గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టి స్పెషల్ కోర్ట్ పీపీగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం, శుభదాయకం అని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాదిగ ఎంప్లాయి ఫెడరేషన్ అధ్యక్షులు కొత్తపల్లి దుర్గయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దారి హరీష్, బోధన్ ఇంచార్జ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్ట్ స్పెషల్ పీపీకి ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES