నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో గల స్థానిక సమస్యలపై సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు మంజురయ్యాయని అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని అన్నారు. దొడ్డి కొమురయ్య నగర్ వాసులకు పట్టాలు ఇంటి టెక్స్ లు లేవు మరి ఇందిరమ్మ ఇంలు ఎలా మంజూరు అయ్యాయో చెప్పాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా అక్కడే ఉంటున్న గల్లీ లీడర్లు పట్టాలెప్పిస్తాం ఇంటి పన్ను ఇప్పిస్తామని ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఏరియాలో ఉంది కావున ప్రభుత్వ అధికారులు ప్రజలకు నేరుగా ఇవ్వాలని గతంలో మధ్యవర్తుల్ని పెట్టి ఇంటి టేక్స్ ల పేరు మీద పట్టాల పేరు మీద డబ్బులు వసూలు చేసి దొంగ పట్టాలు దొంగ టాక్స్ లు చేయించడం వల్ల ఇప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగక జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వమే పట్టాలు కానీ పన్నులు ప్రభుత్వమే నేరుగా ఇవ్వాలి. ప్రజలకు ఇంటి పట్టాలు పన్నులు ఇచ్చేంతవరకు సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య నగర్ శాఖ సభ్యులు యశోద, సంగీత, పంచ పూల, రజియా, దీక్షిత, స్థానికులు అనసూయ, సురేఖ, మాజిత, సత్యమ్మ, ఆసియ తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమరయ్య నగర్ లో స్థానిక సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES