Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుక్కల ఆస్పత్రిని ఎత్తివేయాలని వినతి

కుక్కల ఆస్పత్రిని ఎత్తివేయాలని వినతి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని హనుమాపురంలో కుక్కల ఆస్పత్రిని ఎత్తివేయాలని గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ మాట్లాడుతూ.. భువనగిరి మండలం హనుమపురం గ్రామ పరిధిలో గల సర్వే నెంబరు 28లో కుక్కల ఆస్పత్రిని గ్రామంలో ఎలాంటి సమాచారం లేకుండా గ్రామసభ తీర్మానం లేకుండా గత పాలకులు వారి ఇష్టానుసారంగా మున్సిపాలిటీ అధికారులకు గ్రామ ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

అధికారులు కుక్కలకు సంబంధించిన ఆసుపత్రిని నిర్మించడం వలన కుక్కలను ఆపరేషన్ పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో గల కుక్కలను పట్టుకొచ్చి వాటికి ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడే విడిచిపెట్టడం ద్వారా గ్రామంలో వందలాది కుక్కలు సంచరిస్తూ, గ్రామ ప్రజలపై గొర్రెల పై దాడులు చేస్తున్నాయని అన్నారు. కొన్ని కుక్కలు ఆ ప్రాంతంలోని చనిపోవడం వల్ల ఆ ప్రాంతమంతా కూడా తీవ్ర దుర్వాసనతో నిండిపోయి దగ్గరలో ఉన్న స్మశాన వాటికకు, మల్లన్న గుడికి ,ఎల్లమ్మ గుడికి ,కాటమయ్య గుడికి, ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు ,వ్యవసాయ పొలాలకు వెళ్లలేని పరిస్థితిలో గ్రామ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గతంలో ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది దొంగతనాలకు పాల్పడ్డారని గతంలో 30కి పైగా గొర్రెలను ఎత్తుకెళ్లడం జరిగిందని అన్నారు. వారిని సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడం ద్వారా ఆ వ్యక్తులు ఆస్పత్రికి సంబంధించిన సిబ్బందిగా నిర్ధారణయి ఆ వ్యక్తులను అరెస్టు చేసి, వారి ఆటోను సీజ్ చేయడం గతంలో జరిగిందన్నారు. కావున ఇలాంటి ఆస్పత్రి ప్రమాదకరంగా మారినందున వెంటనే ఆస్పత్రిని ఎత్తివేసి గ్రామ ప్రజలను కాపాడాలని ఈ సందర్బంగా వారు కోరారు. గొర్రెల కాపలాదారులకు న్యాయం చేయాలని దొంగతనాలకు పాల్పడిన సిబ్బంది సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుక్కల ఆస్పత్రిని జనావాసాలకు దూరంగా ఇతర ప్రాంతంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హనుమగంటి సత్యనారాయణ, నాగపురి కృష్ణ, పన్నాల అనంతరెడ్డి ,ఎడ్ల నారాయణరెడ్డి ఎర్రబోయిన నర్సింగరావు , తోటకూరి వెంకటేశు ,గజ్జి నరేష్ ,దయ్యాల మల్లేష్, ఎర్రబోయిన కిష్టయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -