నవతెలంగాణ – జన్నారం
మంచిర్యాల జిల్లాలో అన్ని మండలాల్లో యూరియా కొరత ఉందని ఆ కొరత తీర్చాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి గంగాధర్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతు యూరియా లేక అల్లల్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం రైతులు వేసుకున్న వరి పైరు పొట్ట దశకు చేరుకున్న తరుణంలో, సరిపడ యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు.
గత ప్రభుత్వంలో రైతులకు ఇంత యూరియా కొరత లేకుండా అందించారు అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా దొరకడమే గగనమైందన్నారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో నిల్చోని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒక్క పాస్ బుక్కు కు ఒకే యూరియా బస్తా ఇవ్వడం సరికాదన్నారు. ఎకరానికి ఒక యూరియా బస్తా ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత తీర్చాలని కలెక్టర్ కు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES