Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్లీపర్లతో పెట్టి చాకిరి చేయించుకుంటున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

స్లీపర్లతో పెట్టి చాకిరి చేయించుకుంటున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ..
నవతెలంగాణ – భువనగిరి

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్ స్టాప్ లలో సిపర్ల లకు కనీస వేతనము ఇవ్వకుండా రూ. 8500 ఇస్తూ వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ  డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక బస్టాండ్ లో వేతనాలు పెంచాలని కోరుతూ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఆర్టీసీ స్వీపర్గా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీస వేతనాలు లేవు అన్నారు.

ప్రభుత్వం ఆర్టీసీ  యజమాన్యం సీపర్లకు పర్మనెంట్ చేసి వాళ్లను ఆదుకోవాలన్నారు. వారికి కనీస వేతనము రూ. 21000 ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అరకొర జీతాలతో పస్తులతో ఉండే పరిస్థితి ఉందన్నారు పిల్లలను చదివించడంలో వెనుకబడిపోతున్నారన్నారు కాంట్రాక్టులు మారుతున్నప్పుడు పిఎఫ్ కట్ అయ్యే డబ్బులు విడ్రా చేసుకోవడం వల్ల పెన్షన్కు అనరులుగా మారుతున్నారన్నారు. 

 ఇప్పటికైనా కాంట్రాక్టు ఆర్టీసీ యాజమాన్యం వారు వారికి పిఎఫ్  యుఎన్ఏ నెంబర్ ఇచ్చి వాళ్లకు భవిష్యత్తులో పిఎఫ్ నుండి పెన్షన్ వచ్చేలాగా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కవిత, బుచ్చమ్మ, నరసమ్మ, ధనమ్మ  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -