Monday, September 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్చింతలపల్లెలో వైద్య శిబిరం..

చింతలపల్లెలో వైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని చింతలపల్లి గ్రామంలో సోమవారం మండల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు బీపీ ,షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి జ్వర పీడితులకు రక్తపూతలు తీసి మందులు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వ ఎమ్మెల్ హెచ్పి పల్లవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్ర పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా చూసుకోవాలన్నారు. మలేరియా డెంగ్యూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రషీద్ ఖాన్ (హెల్త్ అసిస్టెంట్) సంధ్య (ఏఎన్ఎం) వనిత (ఆశ కార్యకర్త) గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -