Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేడు ప్రజావాణికి ఫిర్యాదుల వెలువ..

నేడు ప్రజావాణికి ఫిర్యాదుల వెలువ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో గల మల్లికార్జున పార్ బాయిల్డ్  రైస్ మిల్ వాటర్ వలన కలుషితం జరుగుతుందని రైస్ మిల్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రంలో పేర్కొన్నారు. అడ్డగూడూరు మండలంలోని డి రేపాక గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమపై ప్రజాభిప్రాయం సేకరణ జరపాలని గ్రామస్తులు కోరారు. మోటకొండూరు మండలం నాంచారి పేట గ్రామంలో కంట  మహేశ్వర స్వామి కూడా ఆలయాన్ని ప్రహరి గోడ నిర్మాణాన్ని అనుకుంటున్న వ్యక్తిపై  చర్యలు తీసుకోవాలని గౌడ కులస్తులు  కోరారు. 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను  సత్వరమే పరిష్కరించాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 75 అర్జీలను, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు  పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. 

అందులో రెవిన్యూ శాఖ 50,జిల్లాపంచాయతీ 6 మున్సిపాలిటీ 4,శిశు సంక్షేమ 3,జిల్లా గ్రామీణ అభివృద్ధి 3,పోలీస్ 2, లీడ్ బ్యాంక్ 2, విద్యుత్, మదర్ డైరీ, ఇరిగేషన్, ఫుడ్ సేఫ్టీ, గ్రంధాలయం   శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి,అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్ మోహన్ ప్రసాద్, హౌసింగ్ పి.డి విజయసింగ్ వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -