నవతెలంగాణ – జన్నారం
హైదరాబాదులో మేడ్చల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగలకొండ చెందిన గిరిజన బిడ్డ సాయి తేజ ను కళాశాల సీనియర్లు ర్యాగింగ్ చేసి హింసించడం డబ్బులు అడగడం వలన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ర్యాగింగ్ కి పాల్పడిన సీనియర్లకు ఎన్కౌంటర్ లేదా ఉరి శిక్ష వేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని, మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు అజ్మీరా బిమ్లాల్ నాయక్ అన్నారు. సోమవారం జన్నారంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరులతో మాట్లాడారు.
భవిష్యత్తులో ఇలా గిరిజన బిడ్డల మీద ఎవరైనా ర్యాగింగ్ గాని దాడులు చేసేముందు భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో లంబాడ ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, యువ నాయకులు బాధవత్ సాయికిరణ్ నాయక్ అజ్మీరా రాహుల్ తదితరులు పాల్గొన్నారు.