నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వ్యాధి ప్రబలింది. దేశంలో డెంగ్యూ కారణంగా ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాల సంఖ్య నమోదైంది. గడచిన 24 గంటల్లో 12 మంది మృతిచెందారు. రాజధాని ఢాకాలో కొత్తగా 700 కేసులు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 179 డెంగ్యూ బారిన పడి మృతిచెందగా, 42 వేల మంది డెంగ్యూ బారిన పడ్డారని పేర్కొంది. అధిక సంఖ్యలో పిల్లలు డెంగ్యూ బారినపడి ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. బాధితులలో చాలామంది అధిక జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన నిర్జలీకరణతో బాధపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో నిర్లక్ష్యం తగదని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎబిఎం అబ్దుల్లా తెలిపారు. డెంగ్యూ జ్వరం లక్షణాలు దోమ కాటు తర్వాత నాలుగు నుండి 10 రోజుల తర్వాత కనిపిస్తాయి. దోమ కాటు బారినపడకుండా ఉండటమే డెంగ్యూ నివారణకు ఉత్తమమార్గమని వైద్యులు సూచిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రబలిన డెంగ్యూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES