ఆర్టిఐ నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అనర్హులను జాబితాల నుంచి తొలగించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలో మాట్లాడారు. అర్హులైనవారు ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, గ్రామ సభల్లో పేర్లు ఉన్నప్పటికీ, కొందరు అధికారులు, నాయకులు కావాలనే తమ పేర్లను తొలగించారని పేదలు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. భూములు, ఇండ్లు, వాహనాలు ఉన్న అనర్హులకు ఇండ్లు మంజూరు అవడం విడ్డూరంగా ఉందని, భూములు, స్థలాలు లేని తమకు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులం కాదా అని ర్హులైన తమకే ఇండ్లు మంజూరు చేయాలని పేర్కొంటున్నట్లుగా తెలిపారు.ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వానికి పేదల పక్షాన విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES