- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, SR నగర్, అమీర్ పేట్, ఫిలిం నగర్, పంజాగుట్టలో వర్షం దంచికొడుతోంది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై నీరు చేరింది. ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరికొద్దిసేపట్లో నగరం మొత్తం వర్షం కురిసే అవకాశం ఉంది.
- Advertisement -