– పౌష్టికాహారంతో రోగాలకు దూరం: డాక్టర్ మధులిక
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ లో భాగం గా మండలం లోని గుమ్మడివల్లి ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం ఐసీడీఎస్ పర్యవేక్షణలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు,బాలింతలకు, కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో గర్భిణీలకు తొలిదశ నుంచి ఏ ఏ ఆహార పదార్ధాలు తీసుకోవాలి,బాలింతలకు ఎలాంటి పోషకాహారం భుజించాలి,కిషోర బాలికలకు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పెరుగుతారు,వ్యక్తిగత శుభ్రత,పరిసరాల పరిశుభ్రత పై ఏసీడీఓ అలేఖ్య వివరించారు. అల్ప వ్యయంతో అత్యల్ప పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు వండి పెట్టడం చేసి చూపించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ మధులిక,సూపర్వైజర్ లు సౌజన్య,పద్మావతి,వరలక్ష్మి,రమాదేవి,కో ఆర్డినేటర్ శ్రీ కాంత్, అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.