Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్పోరోట్లకు దోచిపెట్టడానికే పత్తిపై దిగుమతి పన్ను తగ్గింపు

కార్పోరోట్లకు దోచిపెట్టడానికే పత్తిపై దిగుమతి పన్ను తగ్గింపు

- Advertisement -

అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ విమర్ష
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు AIUKS ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

కార్పోరోట్లకు దోచి పెట్టడానికే పత్తి పై 11% శాతం దిగుమతి పన్నుతగ్గింపు చేశారని, పత్తి రైతుల పుట్టికి ముంచడానికే కేంద్రం కుట్రపూరితంగా పత్తి పంటపై దిగుమతి పన్ను తగ్గించింద అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు AIUKS ఆధ్వర్యంలో 200మంది రైతులతో ధర్నా నిర్వహించారు.

జేసీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభార్ మాట్లాడుతు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతులకు యూరియా అందించటంలో విఫలమైందని, వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పత్తికి తగ్గించిన సుంకాలు పెంచాలని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మొక్కజొన్న పంట చేతుకోచ్చింది అని ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం సిగ్గుచేటు అన్నారు.

వెంటనే మొక్కజొన్నకు మద్దత్తు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలకు జిల్లా లో ఆర్మూర్, సిరికొండ, భీంగల్, ధర్పల్లి మండలాలతో పాటు అనేక చోట్ల పంటలు నీటిపాలు అయ్యాయని నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్, ప్రధానకార్యదర్శి బి. బాబన్న, ఉపాధ్యక్షులు జి. నడ్పెన్న, వి. బాలయ్య,ఆకుల. గంగన్న, కార్యదర్శి ఆర్. దామోదర్, బి. కిషన్, యు. రాజన్న, కోశాధికారి ఎం. లింబాద్రి, జిల్లా నాయకులు ఇ. రమేష్, కె. నర్సయ్య, టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు కె. రాజేశ్వర్, సహాయకార్యదర్శి ఎం. అనిస్ తదిరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -