జంతు శాస్త్ర అధ్యాపకుడు పెద్దూరి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – నెల్లికుదురు
సీజనల్ గా సంభవించే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకుడు పెద్దూరి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నాడు రామన్నగూడెంలో నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 3వ రోజున సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు.
ఉదయం 6:30 నుండి 7:30 గంటల వరకు వాలంటీర్లు వ్యాయామం చేశారు. అనంతరం 9 నుండి 11:30 గంటల వరకు గ్రామంలోని ప్రధాన వీధుల వెంబడి మరియు బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళముక్కలను తొలగించి శుభ్రపరిచారు. నీరు నిల్వ ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, బోదకాలు వంటి వ్యాధులను కలగజేసే దోమలు పెరుగుతాయని కావున నీటి నిల్వలను లేకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.
సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరచడంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. వాలంటీర్లు సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఐశ్వర్య, నవ్య, సంగీత, యమున, అఖిల, పవన్, అఖిల్, చరణ్, నవీన్, విశాల్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES