Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక

సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  సోమవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి  సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో సబ్ జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించడం జరిగిందనీ కామారెడ్డి కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ  బాణాల భాస్కర్ రెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి జిల్లా జట్టుకు ఎంపిక అయిన బాల,  బాలికలు  కబడ్డీ క్రీడా జట్లు ఈనెల 25 – 9 – 20025 నుండి 28 – 09 – 20025 వరకు నిజామాబాద్ జిల్లాలోని ముప్కల్ లో జరగబోయే  రాష్ట్ర స్థాయి 35 వ సబ్ జూనియర్స్ పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ సెలక్షన్స్ లో పిటీఎస్ ప్రధాన కార్యదర్శి నోముల మధుసూదన్ రెడ్డి, కబడి అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రాజయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్, జిమ్నాస్టిక్స్ సెక్రటరీ నరేష్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు నవీన్, లక్ష్మన్ రాథోడ్, బాలు, సతీష్ రెడ్డి, రేణుక, రాజు, సంజీవ్, లావణ్య తదితర వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -