- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు సోమవారం సిపి సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి నిజామాబాద్ బస్ స్టేషన్ పరిసరాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను, నగరంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల గురించి విన్నవించటం జరిగింది. అలాగే అట్టి సమస్యలను పరిష్కరించి, ఆర్టీసీకి సహకరించాలని డిపో1 మేనేజర్ బిఎస్ ఆనంద్ కోరారు. ఆర్టీసీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మహిపాల్ ప్రభుదాస్ లు ఉన్నారు.
- Advertisement -