Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్లూర్ లో భారీ వర్షం

ఉప్లూర్ లో భారీ వర్షం

- Advertisement -

– పంట చేలలో నిలిచిన నీరు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ లో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాచి, ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సుమారు అరగంటకు పైగా కుండపోతగా కురిసిన భారీ వర్షంతో రోడ్లపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించింది. గ్రామంలో పలు మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. కుండ పోత వర్షంతో మురికి కాలువలు నిండి వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. ప్రస్తుతం గ్రామంలో మొక్కజొన్న, సోయా పంట కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో కురిసిన భారీ వర్షం మూలంగా పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్షం మూలంగా పలు సోయా బిన్ తోటల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున  చేరింది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండడంతో రైతులు చేతికి వచ్చిన పంటలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న పంట నేల వాలుతుందని, సోయ పంట లోకి నీరు నిలవడం మూలంగా పంట నాణ్యత దెబ్బతినేందుకు ఆస్కారం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు మొక్కజొన్న, సోయా పంటలను కోసి కల్లాల్లో కుప్పలు పోసి తాడిపత్రిలు కప్పి ఉంచారు. అయినప్పటికీ పంట నానితే మొలకలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -