నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని శివారు ప్రాంతాల్లో ఉన్న వరి పంటనుమండల వ్యవసాయ అధికారి రాజలింగం వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో కలిసి గాంధారి శివారు లోని వరి పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి మరియు రైతుల తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజలింగం మాట్లాడుతూ.. ప్రస్తుతంవరిలో మోగిపురుగును, మెడవిరుపు మరియు వరి లో ఎండు తెగులు ను గమనించడం జరిగింది.
మోగిపురుగు నివారణకు కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50 ఈసి 400గ్రాములు లేదా క్లోరంటనిలిప్రోల్ 60 ఏం ఎల్ ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్కోవాలని, మెడవిరుపు నివారణకు అజాక్సిస్ట్రోబిన్+టేబుకొనజోల్ 300 ఏం ఎల్ ఎకరానికి లేదా పైరక్సి స్ట్రోబిన్+ ట్రై సైక్లోజల్ 250 ఏం ఎల్/200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చెయ్యాలి అని తెలియజేయడం జరిగింది. వరి ఎండు తెగులుకు ప్లాంట మైసిన్ 80ఏం ఎల్+కాపార్ ఆక్సీ క్లోరైడ్ 600గ్రాములు లేదా అగ్రి మైసిన్ 80ఏం ఎల్+కాపార్ ఆక్సీ క్లోరైడ్ 600 ఏం ఎల్ ను ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలియజేయడం జరిగింది. రైతులు నత్రజని సంబంధిత ఎరువులను తగ్గించి వాడాలని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు నాగళూర్ గంగాధర్,బస్సి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
వరి పంటను పరిశీలించిన ఎంఏఓ రాజలింగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES