నవతెలంగాణ -ముధోల్
లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో బీరప్ప ఆలయ శిఖర ధ్వంసానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీ లత కు వినతిపత్రన్ని అందజేశారు. ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు విట్టల్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు రోళ్ల రమేష్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీలు పోతన్న యాదవ్, దేవోజీ భూమేష్, మాజీ సర్పంచ్ అనిల్, సభ్యులు ధర్మపురి సుదర్శన్, గుంజలోళ్ళ నారాయణ, మైత్రి సాయినాథ్, తాటేవర్ రమేష్, గడ్డం సుభాష్, జీవన్, మోహన్ యాదవ్, బతిన్నోళ్ల సాయి, విట్టల్, శంకర్, లవన్, శంకర్, భోజన్న, తదితరులు, ఉన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES