నవతెలంగాణ – న్యూఢిల్లీ: పండగ సీజన్ ఉత్తేజభరితమైన డీల్స్, భారీ ఎంపికలు, అంతులేని షాపింగ్ అవకాశాలను తెచ్చింది. అదే విధంగా, నకిలీ ఆఫర్లు, తప్పుదారి పట్టించే మెసేజ్ లు కూడా ప్లాట్ ఫాంలలో పంపిణీ అవుతున్నాయి. కస్టమర్లు ఆత్మవిశ్వాసంతో కొనుగోళ్లు చేయడానికి, తమ ఆన్ లైన్ కొనుగోళ్ల అనుభవాన్ని పాడుచేసే కొద్దిమంది చెడు నటుల నుండి తమను తాము కాపాడుకొని మరియు అప్రమత్తంగా ఉండవలసిందిగా అమేజాన్ ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తోంది.
“ప్రత్యేకమైన పండగ డీల్“, “అత్యవసరంగా అకౌంట్ ధృవీకరణ”, లేదా అమేజాన్ నుండి వచ్చినట్లుగా వివరించే అనుమానస్పద లింక్ లేదా ఏదైనా ఇతర షాపింగ్ వెబ్ సైట్ గురించి మెసేజ్ లను క్లిక్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి లేదా చెల్లించడానికి ముందు జాగ్రత్తగా ఉండవలసిందిగా సలహా ఇవ్వబడింది.
ఆన్ లైన్ షాపింగ్ లో కస్టమర్ నమ్మకం మరియు భద్రతకు తమ నిబద్ధతలో భాగంగా అమేజాన్ ఇండియా మోసాలు లేని సెప్టెంబర్ ను పాటించడానికి హోం వ్యవహారాల శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)తో భాగస్వామ్యం చెందింది. కలిసికట్టుగా అమేజాన్ మరియు I4Cలు ఈ పండగ సీజన్ లో కస్టమర్లు మోసాలను త్వరగా గుర్తించడానికి మరియు ఆత్మవిశ్వాసంతో షాపింగ్ చేయడానికి మీడియా మరియు డిజిటల్ ప్లాట్ ఫాంలలో (watch video here – https://www.instagram.com/reel/DOnjl7-E38g/) చైతన్యం కాంపైన్లను ప్రోత్సహిస్తున్నారు.
“పండగలు మీ ఇంటిని ఆనందంతో నింపాలి కానీ ఆందోళనతో కాదు. మీరు స్వీకరించిన ఏదైనా ‘ఇప్పుడు చర్య తీసుకోండి‘; ‘ఫీజు చెల్లించండి’; ‘తెలియని కొనుగోలును నిర్థారించండి‘ వంటివి మీకు గుండె దడ కలిగిస్తే దానిని హెచ్చరికగా భావించండి, క్లిక్ చేయడానికి కారణం కాదు అని భావించండి. ఏది నిజమో ధృవీకరించడానికి, మా రక్షణలపై ఆధాపడటానికి మరియు ఏదైనా అనుమానస్పద విషయం గురించి నివేదించడానికి అమేజాన్ యాప్ కి లేదా వెబ్ సైట్ కి లాగ్ ఇన్ చేయండి. అందువలన మీకు మరియు ఇతరుల కోసం నివారించడానికి మేము సహాయపడగలం,” అని అశ్విని సమ్రాజ్, డైరెక్టర్, పబ్లిక్ రిలేషన్స్ & కమ్యూనికేషన్స్, అమేజాన్ ఇండియా అన్నారు.
2023లో అంతర్జాతీయంగా మా కస్టమర్లు నివేదించిన అమోజాన్ గా మోసగించిన మోసాలలో మూడింట రెండు వంతులు నకిలీ “ ఆర్డర్“ లేదా “ ఖాతా“ సమస్యలను కలిగి ఉన్నాయి. మారవేషంతో చేసే మోసాలు అమేజాన్ మార్కెట్ ప్రదేశం బయట ఇమెయిల్, టెక్ట్స్, మెసేజింగ్ యాప్స్, లేదా ఫోన్ కాల్స్ ద్వారా ప్రారంభమయ్యాయి. నేరగాళ్లు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ను అనుకరించి షాపర్స్ ను మోసం చేయడానికి అత్యవసరంగా సున్నితమైన సమాచారం తెలియచేయాలని లేదా నకిలీ చెల్లింపులు చేయాలని తప్పుడు భావాన్ని కలిగిస్తారు.
§ స్కామర్లు మీ అకౌంట్ “సస్పెండ్ చేయబడంది”, “ఆర్డర్”కు ధృవీకరణ అవసరం, లేదా మీరు “చెల్లింపు” వెంటనే నిర్థారించాలని కోరవచ్చు.
§ లక్ష్యం: హానికరమైన లింక్స్ క్లిక్ చేయడానికి, వివరాలు తెలియచేడానికి లేదా అమేజాన్ కు బయట చెల్లింపులు చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడం.
ఏ విధంగా సురక్షితంగా ఉండాలి- శీఘ్ర ధృవీకరణ విధాలు
1. ఆగండి మరియు ధృవీకరించండి – ఏదైనా లింక్ ను క్లిక్ చేయడానికి ముందు లేదా స్పందించడానికి ముందు పది సెకండ్లు తీసుకోండి.
2. ‘మీ ఆర్డర్లు తనిఖీ చేయండి’ – అమేజాన్ యాప్ తెరవండి లేదా వెబ్ సైట్ కి వెళ్లండి. అది జాబితాలో లేకపోతే, అది నిజం కాదు.
3. గుర్తుంచుకోండి – అమేజాన్ ఇలా ఎప్పుడూ చేయదు:
o ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా చెల్లింపును అడగటం
o గిఫ్ట్ కార్డ్స్ కొనుగోలు చేయవలసిందిగా మిమ్మల్ని ఒత్తిడి చేయడం
o మద్దతు కోసం సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయవలసిందిగా మిమ్మల్ని అడగడం
నేపధ్యంలో గమనిస్తే, అమేజాన్ సురక్షితమైన ఇమెయిల్ సామర్థ్యాలను అవలంబించే నేర కార్యకలాపాలను నిరోధించడానికి మరియు అంతరాయం కలిగించడానికి భారీగా పెట్టుబడి పెడుతోంది కాబట్టి ప్రామాణిక సందేశాలు ప్రధానమైన ఇన్ బాక్స్ ప్రొవైడర్లలో అమేజాన్ స్మైల్ లోగోను ప్రదర్శిస్తాయి మరియు దుకాణాన్ని రక్షించడానికి ఇంజనీర్లు, పరిశోధకులు మరియు ML శాస్త్రవేత్తల బృందాలను నియామకం చేస్తాయి. కేవలం 2024లోనే అమేజాన్ వేలాది ఫిషింగ్ వెబ్ సైట్స్ ను మోసపూరితమైన పథకాలతో సంబంధమున్న వేలాది ఫోన్ నంబర్లను తొలగించడం ప్రారంభించింది.
చివరిగా గుర్తు పెట్టుకోండి, మీరు Amazon.inలో కొనుగోళ్లు చేస్తున్నప్పుడు, మీరు అమేజాన్ వారిA-to-Z హామీ ద్వారా రక్షించబడతారు. ప్రతి కొనుగోలు వెనక అమేజాన్ మద్దతు ఉంటుంది. డెలివరీ సమయాలు లేదా పరిస్థితితో ఏదైనా తప్పు జరిగితే అమేజాన్ సరి చేస్తుంది. సురక్షితమైన మార్గం కూడా సాధారణమైనది: అమేజాన్ యాప్ లేదా వెబ్ సైట్ లో మాత్రమే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మరియు పూర్తి చేయండి.
మీ షాపింగ్ ను తక్షణమే సురక్షితం చేయడానికి తెలివైన చర్యలు
§ యాప్ లో కొనుగోళ్లు ధృవీకరించండి: ఏదైనా మెసేజ్ కు స్పందించడానికిబదులు అమేజాన్ యాప్ లో లేదా వెబ్ సైట్ లో ‘ మీ ఆర్డర్లు‘ తనిఖీ చేయండి.
§ అధికారిక ఛానల్స్ ను మాత్రమే విశ్వసించండి: అమేజాన్ యాప్/వెబ్ సైట్ లో మాత్రమే చెల్లింపులు జరుగుతాయి కానీ మీకు ఎవరో మెసేజ్ చేసిన యాదృచ్ఛికంగా వచ్చిన లింక్ పై బ్యాంక్ ట్రాన్స్ ఫర్ ల ద్వారా చేయకూడదు.
§ తప్పుడు అత్యవసరతను పట్టించుకోవద్దు: మోసగాళ్లు క్లాక్ ను ఆయుధంగా ఉపయోగిస్తారు; మీరు విరామం తీసుకోవడం ద్వారా వారి మోసాలను నివారించవచ్చు.
§ మద్దతు లేదా “ఫీజు “ కోసం గిఫ్ట్ కార్డ్స్ తో ఎన్నడూ చెల్లించవద్దు. అది మోసాలకు హాల్ మార్క్.
§ మీకు ఖచ్చితంగా తెలియకపోతే యాప్/వెబ్ సైట్ ద్వారా అమేజాన్ ను నేరుగా సంప్రదించండి. టెక్ట్స్ లేదా శోధన ఫలితాల నుండి నంబర్లను కాల్ చేయవద్దు.
§ నివేదించండి: అనుమానస్పద సందేశాలు నివేదించడానికి కస్టమర్లు అమేజాన్ సెల్ఫ్-సర్వీస్ సాధనం ఉపయోగించవచ్చు. కస్టమర్లు కాని వారు reportascam@amazon.comకి నివేదించవచ్చు; మీరు ఫిషింగ్ ఇమెయిల్స్ ను stop-spoofing@amazon.comకి కూడా ఫార్వర్డ్ చేయవచ్చు. మీ నివేదనలు అమేజాన్ చెడు నటుల్ని గుర్తించి, చర్య తీసుకోవడానికి సహాయపడతాయి.