నవతెలంగాణ – పరకాల
పరకాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు కలసి పరకాల నుండి నర్సంపేట వరకు కొనసాగుతున్న బస్ సర్వీస్ రూటును పరకాల నుంచి వయా రాజిపేట, వెల్లంపల్లి, పోచారం, నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, తహరాపూర్, మాందారిపేట జంక్షన్, శాయంపేట, పత్తిపాక మీదుగా నర్సంపేట చేరేలా రూట్ మ్యాప్ మార్చలని ఆయా గ్రామాల ప్రజలు పరకాల ఆర్టీసీ మేనేజర్ రాంప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ రూటు మాపు ప్రకారం సర్వీస్ కొనసాగించినట్లైతే రాజిపేట, గట్లకానిపర్తి, శాయంపేట, సూరంపేట తదితర ఏడు గ్రామాల ప్రజలకు సౌకర్యంతో పాట ప్రత్యేకంగా ఇప్పటివరకు ప్రభుత్వ బస్ ఎరుగని సూరంపేట గ్రామానికి ఇది మొదటిసారి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఆ గ్రామస్థులు ఆశాభావం వ్యక్తంచేశారు.
అంతేకాకుండా శాయంపేట మండలానికి చెందిన నర్సింహులపల్లి,గట్లకానిపర్తి,సూరంపేట తహరాపూర్ గ్రామాల ప్రజలు ప్రతిరోజూ మండల కేంద్రమైన శాయంపేటకు, అలాగే నర్సంపేట, ములుగు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరముంటుందని, పలు శాఖల కార్యాలయాలు, మహిళా సంఘాలకు చెందిన సభ్యులు, బ్యాంకు, ప్రభుత్వ పనుల కోసం వెళ్ళాల్సి వచ్చినప్పుడు బస్ సౌకర్యం లేక నాన అవస్థలు పడుతున్నామన్నారు. ఈ రూట్‌లో బస్ సర్వీస్ అందించడం ద్వారా ప్రజలకున్న ఇబ్బందులు తొలగడంతో పాటు ఆర్టీసీకి సైతం రెవెన్యూ గణనీయంగా పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ రూట్లో నర్సంపేట పరకాల సర్వీస్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శాయంపేట, పరకాల మండలాలకు చెందిన గ్రామస్థులు పాల్గొన్నారు. గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వైనాల కుమారస్వామి, బొమ్మ కంటి ముత్యాలు, బొమ్మకంటి నాగరాజు, తప్పెట్ల నాగరాజు, సుంచు రాజు,వెల్లంపల్లి గ్రామానికి చెందిన పూరెళ్ళ సూర్యం, పోచారం గ్రామానికి చెందిన నీరటి అశోక్, గంపలపెళ్లి చంద్రమోహన్, పెంతాల రాజిరెడ్డి