నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ పోలీస్ స్టేషన్ ను సోమవారం బైంసా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న పాత కేసుల వివరాలను కుభీర్ ఎస్ ఐ కృష్ణ రెడ్డి కి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల ను వెంటనే పరిశీలించి వాటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విదంగా మండలంలో ఉన్న అన్ని గ్రామమలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా చూడలని అన్నారు.
రాత్రి సమయలో బస్తి పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు స్నేహితులు గా ఉండి వారి సమస్యను వెను వెంటనే పరిశీలించి పరిష్కారం అయ్యేలా చూడలని పోలీస్ సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ చూసి ఎస్పీ సంతృపి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎస్ ఐ కృష్ణ రెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు.
