నిండుకుండల చెరువులు, కుంటలు
నవతెలంగాణ – పాలకుర్తి
మండలంలోని చెరువులు, కుంటలు జలకళలాడుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని చెరువులు, కుంతలు నిండుకుండలా మారాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. సుమారు రెండున్నర గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి పెరగడంతో చెరువులు, కుంటలు మత్తళ్ళతో పరవళ్ళు తీస్తున్నాయి. జూన్ నెల నుండి ప్రారంభమైన వర్షాకాలం సీజన్లో ఆదివారం కురిసిన వర్షం అతి భారీ వర్షం అని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
అరకొర వర్షాలే తప్ప ఇంతటి వర్షం నాలుగు నెలల కాలంలో ఎప్పుడు కురవలేదని తెలిపారు. దేవాదుల కాలువలో వరద ఉధృతి భారీగా పెరగడంతో సాగునీరు చెన్నూరు రిజర్వాయర్కు చేరుకుంది. భారీ వర్షానికి చెరువులు కుంటలు నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి మత్తళ్ళు పోయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చెరువుల జలకళ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES