విడిసి సభ్యుల వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నీటి ట్యాంక్ ను కుల్చేస్తానన్న కారోబార్ కొండ రవి పై చర్యలు తీసుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి సమస్యలతో కూడిన పత్రాన్ని అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.ఇందల్ వాయి మండలంలోని గౌరరం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగపూర్ గ్రామంలోని 7వార్డులో గత 25 ఏళ్ల క్రితం నిర్మించారు. అదే గ్రామంలో కారోవరగా ఉన్న కుండ రవి గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ లోనికి నీళ్లు నింపకుండా చేస్తూ వాటర్ ట్యాంక్ కూల్చి ఆ భూమిని సబ్జా చేయాలని చూస్తున్నారని విడిసి సభ్యులు పేర్కొన్నారు.
ఏమి వెళ్లి కారభారతం ప్రశ్నిస్తే గ్రామపంచాయతీలో నేను ఉంటా మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ నోటికి వచ్చినట్లు బూతు మాటలు తింటూ ట్యాంక్ కూల్చివేస్తాన్ నీళ్లు దీనిలో నింపవద్దని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని పోయారు. ఇదే విషయమై మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కి పోలీస్ స్టేషన్లో ఎస్సై కు పలువురు ఫిర్యాదులు చేసినట్టు వారు తెలిపారు. ఒక గ్రామ పంచాయతీలో కారోబార్గా ఉంటూ కూల్చివేస్తా అని చెప్తు గ్రామ ప్రజలకు,దళిత కాలనీ వాసులకు భయభ్రాంతులకు గురిచేస్తున్న కొండ రవి పై వెంటనే చర్యలు వారు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.