Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆటలతో శారీరక, మానసిక దృఢత్వం..

ఆటలతో శారీరక, మానసిక దృఢత్వం..

- Advertisement -

టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ – దుబ్బాక 

ఆటలతో శారీరక, మానసిక దృఢత్వం లభిస్తుందని, యువత చదువుతో పాటే క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో పీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెండు రోజులపాటు జరుగునున్న ఈ పోటీల్లో సుమారు 60 టీంలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ యువతకు చదువు తో పాటు క్రీడల్లోనూ అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ క్రీడా పోటీల కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చందిరి సంజీవరెడ్డి, జిల్లా నాయకులు అందె రాజిరెడ్డి, బిజ్జ గిరిబాబు, వెంకట్, రాజేందర్, పలువురు పీడీలు, పీఈటీ లు, యువత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -