Tuesday, September 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమరో ఏడాది పాటు అణ్వాయుధ పరిమితులకు కట్టుబడి ఉంటాం

మరో ఏడాది పాటు అణ్వాయుధ పరిమితులకు కట్టుబడి ఉంటాం

- Advertisement -

తేల్చి చెప్పిన పుతిన్‌

మాస్కో : మరో ఏడాది పాటు అణ్వాయుధ పరిమితులకు కట్టుబడి వుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం చెప్పారు. అమెరికాతో గల అణు ఒప్పందానికి ఫిబ్రవరిలో కాలం చెల్లిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. రష్యా భద్రతా మండలి సభ్యులతో సమావేశంలో మాట్లాడుతూ పుతిన్‌, 2010 న్యూ స్టార్ట్‌ ఒప్పందం రద్దు అంతర్జాతీయ సుస్థిరతపై ప్రతికూల ప్రభావాలు కలిగిస్తుందని అన్నారు. మాస్కో తరహాలోనే అమెరికా కూడా ఈ ఒప్పందం పరిమితులకు కట్టుబడి వుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. న్యూ స్టార్ట్‌ ఒప్పందంపై 2010లో అప్పటి ఇరు దేశాల నేతలు ఒబామా, దిమిత్రి మెద్వెదెవ్‌లు సంతకాలు చేశారు. ఇరు దేశాలు 1550 కన్నా అణు శీర్షాలను, 700కి పైగా అణు క్షిపణులు, బాంబర్లను కలిగి వుండరాదని ఒప్పందం నిర్దేశిస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా అన్నీ జరుగుతున్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి తనిఖీలు జరగాల్సి వుంది. అయితే 2020 నుండి ఉభయ పక్షాలూ ఈ విషయంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. 2023 ఫిబ్రవరిలో ఈ ఒప్పందంలో మాస్కో ప్రాతినిధ్యాన్ని పుతిన్‌ రద్దు చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా ఓటమే తమ లక్ష్యమని అమెరికా, నాటో మిత్రపక్షాలు బహిరంగంగా ప్రకటించినపుడు తమ అణు ప్రదేశాల్లో అమెరికా తనిఖీలను అనుమతించేది లేదని పుతిన్‌ స్పష్టం చేశారు. అయితే తాము మొత్తంగా ఒప్పందం నుండి వైదొలగడం లేదని కూడా నొక్కి చెప్పారు. ఒప్పందం నిర్దేశించిన మేరకు అణ్వాయుధాలపై పరిమితులను గౌరవిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకే తాజాగా మరో ఏడాదిపాటు అణు పరిమితులకు కట్టుబడి వుంటామని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -