మంత్రి జూపల్లికి కేజీకేఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కల్లుగీత కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణ, ఉపాధ్యక్షులు వి వెంకటనర్సయ్య, కార్యదర్శి రమేష్‌గౌడ్, రాష్ట్ర నాయకులు ఎన్.ఆశన్నగౌడ్, జి జంగన్న, కృష్ణగౌడ్ హైదరాబాద్‌లో ఎక్సైజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావుని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. వృత్తిలో ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నందున గీత కార్మికులందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన వారికి మూడేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా రూ. 12.60 కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమను ప్రారం భించాలని కోరారు. 50ఏండ్లకు పైబడిన గీత కార్మికులందరికీ పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదెకరాల చొప్పున భూమి ఇవ్వాలనీ, నూతన గ్రామపంచాయతీల్లో కొత్త కల్లు షాపులు మంజూరు చేయాలనీ, అర్హులైన వారికి కొత్త లైసెన్సులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపు టెండర్లలో 25శాతం సొసైటీలకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES