ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం జంటగా రూపొందుతున్న చిత్రం ‘మిత్ర మండలి’. ఈ చిత్ర టీజర్‌కు, ‘కత్తందుకో జానకి’, ‘స్వేచ్చా స్టాండు’ పాటలకు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత ఈ చిత్రం నుంచి మూడవ గీతం ‘జంబర్ గింబర్ లాలా’ను హైదరాబాద్‌లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన లాంచ్ ఈవెంట్‌లో మేకర్స్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘అందరూ హాయిగా నవ్వుకునే సినిమా తీయాలనే గొప్ప ఆలోచన చేసిన నిర్మాతలు కళ్యాణ్, భాను, విజయేందర్‌కు నా అభినందనలు. నవ్వించే ఇలాంటి మంచి చిత్రాలను అందరూ ఆదరించండి. అక్టోబర్ 16న ఈ సినిమా విడుదలవుతుంది’ అని తెలిపారు.
‘ఈ సినిమా చూసి థియేటర్లలో అందరూ బాగా నవ్వుతారని హామీ ఇస్తున్నాను’ అని హీరో ప్రియదర్శి చెప్పారు. ‘బ్రహ్మానందం మన అందరి జీవితంలో భాగమైపోయారు. ఆయనే ఒక భాషలా మారిపోయారు. మన ప్రతి భావాన్ని ఆయన మీమ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ద్వారానే పంచుకుంటాం’ అని సమర్పకులు బన్నీ వాసు చెప్పారు. నిర్మాత విజయేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ, ‘ఈ కాలేజీలోనే ‘హాయ్ నాన్న’ సినిమాలోని ‘ఒడియమ్మా’ పాటను విడుదల చేశాం. అది హిట్ అయ్యింది. ఇప్పుడు ‘జంబర్ గింబర్ లాలా’ కూడా హిట్ అవుతుంది’ అని అన్నారు. ‘నా మొదటి సినిమాలో బ్రహ్మానందం ఉండటం గౌరవంగా భావిస్తున్నాను’ అని దర్శకుడు విజయేందర్ ఎస్ తెలిపారు.
ఆద్యంతం నవ్వించే ‘మిత్రమండలి’
- Advertisement -
- Advertisement -