Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅగ్రసేన్‌ మహరాజ్‌కు సీఎం రేవంత్‌ నివాళి

అగ్రసేన్‌ మహరాజ్‌కు సీఎం రేవంత్‌ నివాళి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అగ్రసేన్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12 లో గల ఆయన విగ్రహానికి అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏ దానం నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు మేడారానికి సీఎం రేవంత్‌ జాతర ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి సోమవారం మేడారంలో పర్యటించనున్నారు. త్వరలో జరగనున్న సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. అనంతరం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై సీఎం క్షేత్ర స్థాయి లో సమీక్ష నిర్వహించనున్నారు. జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -