Tuesday, September 23, 2025
E-PAPER
Homeజిల్లాలుNizamabad: గోడ కూలి తండ్రి, చిన్నారి మృతి

Nizamabad: గోడ కూలి తండ్రి, చిన్నారి మృతి

- Advertisement -

నవతెలంగాణ కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున గోడ కూలి తండ్రి, కూతురు మృతి చెందారు. ఇంటి పక్కనే ఉన్న రైస్‌మిల్‌ గోడ కూలి వీరు నివాసం ఉంటున్నన రేకుల షెడ్డుపై పడింది. దీంతో షెడ్డులో నిద్రిస్తున్న ఇందూరు మహేష్ కుమార్, నెలల వయసు ఉన్న చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారి తల్లి మహేశ్వరికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రైస్‌మిల్‌ గోడ పూర్తిగా తడిసిపోయి కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -