Tuesday, September 23, 2025
E-PAPER
Homeఖమ్మంభవన నిర్మాణ కార్మికులకు జీఓ నెంబర్ 22 గొడ్డలిపెట్టు

భవన నిర్మాణ కార్మికులకు జీఓ నెంబర్ 22 గొడ్డలిపెట్టు

- Advertisement -

– కార్మికుల సంక్షేమం నిధి.. ప్రయివేట్ భీమా కంపెనీలకు ధారాదత్తం
– సీఐటీయూ నేత అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట 

కార్మిక సంక్షేమ శాఖ తీసుకొచ్చిన జీఓ నెంబర్ 22 భవన నిర్మాణ కార్మికులకు గొడ్డలి పెట్టు లాంటిదే నని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 22 ను వెంటనే రద్దు చేయాలని,పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. 

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కార్మికుల అడ్డాల పై ప్లే కార్డులతో మంగళవారం నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు తమ చెమటను రక్తం గా మార్చి పైసా పైసా పొదుపు చేసుకున్న నిర్మాణ కార్మికుల సొమ్ము  ప్రయివేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెడితే కార్మికుల న్యాయం జరగదని ఆవేదన చెందారు. నిర్మాణ రంగ కార్మికులు ఇప్పటికే పెళ్లి కానుకల కు, కాన్పులు కు, సహజ మరణం,ప్రమాద మరణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారి క్లైం ల ను పరిశీలించకుండా సంక్షేమ బోర్డు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు.

కార్మికులు సంక్షేమ బోర్డును పకడ్బందీగా అమలు చేయాలని కోరుతుంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఊరు పేరు లేని ముంబైకి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీకి వందల కోట్ల రూపాయలు చెల్లించటం భవన నిర్మాణ కార్మికుల కష్టాన్ని బూడిద పాలు చేయడమేనని అన్నారు.ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఏడాది జులై 27 తర్వాత మరణించిన కార్మికులను మాత్రమే లబ్ధిదారులు గా గుర్తిస్తామని అనడం అంటేనే భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందకుండా చేయడమేనని అన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు గొడ్డలి పెట్టు గా ఉన్న జీవో 22 ను వెంటనే రద్దు చేయాలని సంక్షేమ బోర్డును ప్రభుత్వమే నిర్వహించి భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు భీమా చెన్నారావు,తిరుమల శెట్టి వెంకన్న బాబు, మండల అధ్యక్షులు కణితి సరసా రావు,నాయకులు శ్రీను గురునాధం,లక్ష్మీనారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -