నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అమ్మవారిని హుజురాబాద్ మాజీ ఎం ఎల్ ఏ, ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.
మన దేశం స్త్రీలను పూజించే, గౌరవించే దేశం అని అన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, ఆలయాలు అన్నిటినీ గొప్పగా కాపాడుతున్నారు. వచ్చే కాలంలో ఈ దేశం ప్రపంచంలో ప్రశాంతమైన దేశంగా, గొప్పగా ఎదగే దేశంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి, సంపత్ రావు, శ్రీరామ్ శ్యామ్, సురేందర్ రాజు, విక్రమ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.