రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్నిక
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కమిటీలోకి నగరానికి చెందిన కటారి రాములుకు చోటు దక్కింది. తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ డబ్ల్యుఎఫ్- సిఐటియు) రాష్ట్ర 4వ మహాసభలు 2025 సెప్టెంబర్ 20, 21 తేదీల్లో కా. ఎర్రా శ్రీకాంత్ నగర్, కా. బొట్ల శ్రీనివాస్ ప్రాంగణం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్లో జరిగాయి. మహాసభల ముగింపు సందర్భంగా నూతన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ను, రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
నిజామాబాద్ జిల్లా నుండి ప్రతినిధులు ఆరుగురు హాజరయ్యారు. ఈ మహాసభలో నిజామాబాద్ నుండి కటారి రాములు నీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న కాలంలో రవణ రంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనిరోడ్డు రవాణారంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఎం.వి. యాక్టు బిల్లును ఉపసంహరించుకోవాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉసంహరించుకోవాలి. ఈ సమస్యలపై రానున్న కాలంలో నిజామాబాద్ జిల్లాలో పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు.
తీర్మానాలు..
రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి.. రోడ్డు రవాణారంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఎం.వి. యాక్టు బిల్లును ఉపసంహరించుకోవాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను ఉసంహరించుకోవాలి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరియు నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలి.ఆర్టిసి కార్మికులపై వేధింపులు ఆపాలి. యూనియన్లను పునరుద్ధరించాలి. ఆర్టీసిని రక్షించాలి.. బడ్జెట్లో నిధులు కేటాయించి, కొత్త బస్సులు కొనాలని మహాసభలో తీర్మానాలు చేసింది. ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ యాప్లను రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వం కొత్త యాప్లను తీసుకురావాలని మహాసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాలు ఏకగ్రీవంగా ప్రతినిధులు ఆమోదించారు.