Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో సీఎం పర్యటించి నెలలు గడుస్తున్నా రైతులకు అందని నష్టపరిహారం

జిల్లాలో సీఎం పర్యటించి నెలలు గడుస్తున్నా రైతులకు అందని నష్టపరిహారం

- Advertisement -

 – వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి జిల్లా ప్రజలు రైతులు అతలకుతలమై పంటలు నష్టం జరిగినప్పటికీ నెలలు గడుస్తున్న ఇప్పటివరకు నష్టపరిహారం ఉందా లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డిలో పర్యటించి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ స్పష్టంగా ఈ జిల్లాకు ఎంత నష్టపరిహారం కేటాయిస్తము ఒక రైతుకు జరిగిన ఎకరానికి పంటకు ఎంత కేటాయిస్తామో స్పష్టమైన హామీ ఇవ్వకుండా అంతా నేను చూసుకుంటా అని చెప్పి వెళ్లడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారాన్ని రైతులకు చదువుకోవడం కామారెడ్డి ప్రజలను నమ్మించి మోసగించడమే అన్నారు. ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్, నాయకులు లిబియా, ఎల్లం, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -