ప్రతి యేటా వైభవంగా జాతర ఉత్సవాలు..
ఆదాయం పెరిగినా సౌకర్యాలు అంతంత మాత్రమే..
సవతెలంగాణ – సారంగాపూర్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం, అడెల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఆడెల్లి మహా పోచమ్మ ఆలయం మరో పర్యటక కేంద్రంగా విరాజిల్లుతుంది. ఆలయం సమీపంలో సహ్యద్రి పర్వతాలకు అనుకొని ఉంది. ఈ ఆలయం రెండు వేల సంవత్సరాల కింద వెలిసినట్టు ఆలయ పూజారులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా అమావాస్య తర్వాత దసరాకు ముందు వచ్చే శనివారం, ఆదివారాల్లో రెండు రోజుల పాటు గంగా నీళ్ల జాతర నిర్వహిస్తారు.
శ్రీ మహా పోచమ్మ దేవాలయం గంగనీళ్ళ జాతర..
ఈనెల 27న శనివారం ప్రారంభమై 28 ఆదివారం సాయంత్రంతో ముగుస్తుంది. పోచమ్మ దేవాలయం. నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించి. వివిధ గ్రామాల గుండా అడెల్లి, సారంగాపూర్, యాకరప, వంజర్, ప్యారమూర్, మాడేగాం. దిలావరూర్, ఐన్నపెల్లి, కంజర్, మల్లాపూర్ మీదుగా.. సాంగ్య గ్రామంలోని గోదావరి నది తీరాన రాత్రి బస చేసి, మరుసటి రోజు ఆదివారం రోజున ఉదయం నగంటలకు నదిలో శ్రీ అమ్మవారి ఆభరణములను శుద్ది చేసి, గోదావరి జలాలతో సేవాచారులు, భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి, తిరుగు ప్రయాణం పాదయాత్రగా భాజా భజంత్రీలతో ఉదయం ప్రారంభమై వెళ్లిన గ్రామాల మీదుగా అడెల్లీ మహా పోచమ్మ ఆలయానికి చేరుకుంటారు.
దారి పొడువునా గ్రామగ్రామాన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఆలయంలో అమ్మవారికి గోదావరి జలాలతో అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు ఆభరణాలు ఆలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేస్తారు. భక్తుల సౌకర్యార్థం నిర్మల్, భైంసా డిపోల నుంచి అడెల్లి దేవాలయం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తారు.
“ఆలయ పునర్నిర్మాణం”
దేవాదాయ శాఖ రూ.6 కోట్లతో నిధులతో కృష్ణ శిజలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అక్టోబర్ చివరి వారంలో నూతన ఆయాలంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన ఆలయ ప్రారంభోత్సవం జరగనున్నట్టు ఆలయ కమిటీ, అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం పోచమ్మదేవి బాల ఆలయంలో పూజలందుకుంటోంది.
జాతరలో భక్తుల తాకిడి ఎక్కువ..
ఈ జాతర రోజుల్లో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. జాతర ముగిశాక సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి కోనేటి నీటితో స్థ్నానాలు చేసి భక్తిశ్రద్దలతో చక్కెర బెల్లంతో బోనాలు పండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనంతరం అమ్మవారికి ఓడి బియ్యం నూతన వస్త్రాలు సమర్పించి, కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేస్తారు.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్రలోని వాందేడ్, నాగపూర్, ముంబాయి పట్టణాల నుండి, చత్తీస్ ఘర్ రాష్ట్రం నుంచి యాత్రికులు. ప్రత్యేక వాహనాల్లో అధిక సంఖ్యలో ప్రతి ఆదివారం వస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ, అధికారులు ఏర్పాట్లను చేశారు. ఆలయానికి ప్రతి ఆదివారం నిర్నల్, బైంసా డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా భోత్ నుంచి అడెల్లి ఆలయానికి నూతనంగా రోడ్డు పూర్తయింది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఉదయం నుండే కోనేటి నీటితో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.
ఆలయానికి వివిధ రూపాల్లో ఆదాయం..
తలనీలాలు, వసతిగృహాలు, దర్శన్, కొబ్బరికాయ టికెట్ల రూపంలో రూ.60 లక్షలు, వ్యాపార దుకాణం టెండర్లు ద్వారా రూ.60 లక్షలు, హుండీ ఆదాయం రూ.60 లక్షలు మొత్తం రూ.1 కోటి 90 లక్షలు ఆదాయం చేకూరుతుంది.
ఆదాయం పెరిగినా సౌకర్యాలు అంతంత మాత్రమే..
ఆలయం వద్ద అటవీ అధికారులు ఏర్పాటు చేసిన నందన వనంలోకి భక్తులను అనుమతించాలి. దీంతో పచ్చని చెట్లకింద వంటలు చేసుకొని వెళ్లేందుకు వీలుగా ఉంటుందని భక్తులు కోరుతున్నారు.
యేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య..
భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వేసవి కాలంలో వచ్చి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, వారికి తాగునీటి వసతి, వసతి గృహాలు సరిపడక, భక్తులు ప్రయివేటు వ్యక్తులు నిర్మించిన వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆలయానికి వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. ఆలయ సమీపంలో సులాబ్ కాంప్లెక్స్ లు అరకొర ఉన్నందున ముఖ్యంగా మహిళలకు ఇబ్బందిగా ఉంది. యుద్ధ ప్రతిపాదికన సులబ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.