- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన ‘బలగం’ సినిమా మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా కుటుంబ బంధాలను అద్భుతంగా చిత్రీకరించి, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
- Advertisement -