Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంతపురి వాసికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

మంతపురి వాసికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన బండారి ప్రసాద్ ముదిరాజ్ కు మంగళవారం నాడు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూనే తనలాగ నిరుపేద కుటుంబం నుండి స్టేట్, సెంట్రల్ పోలీస్ ఉద్యోగాలకు చదివే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సైనిక గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వాట్సాప్ మాధ్యమం ద్వారా 8000 మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు . ఉచిత బుక్స్, షూస్, ట్రైనింగ్ వంటివి ఇస్తూ 175 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేశారు. వారి సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటును కల్పించారు. ఈ అవార్డును యువజన, క్రీడలు, మత్స్యశాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ చేతుల మీదుగా సైనిక గ్రూప్ ఫౌండర్ బండారి ప్రసాద్ ముదిరాజ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖుల అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -