కబడ్డీ అసోసియేషన్ మహబూబాద్ జిల్లా సెక్రెటరీ సంద వీరన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
కొరవి మండలంలో వారం రోజుల నుండి జరిగిన కబడ్డీ పోటీలో నెల్లికుదురు మండలంలోని ఆలేరు పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కబడ్డీ ఆసోసియేషన్ జిల్లా సెక్రెటరీ సంఘ వీరన్న మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురవి లో జరిగిన మహబూబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్స్ బాలుర క్యాంపు యందు మంగళవారం జరిగిన ఫైనల్ సెలక్షన్ యందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆలేరు విద్యార్థులు బానోతు సాయి చరణ్, ఎండి సమీర్ , ఎల్. నవదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుండి 28 వరకు నిజాంబాద్ జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షులు మద్ది వెంకటరెడ్డి జాయింట్ సెక్రటరీలు చాంప్లా నాయక్, రాసమల్ల అనిల్ పాల్గొన్నారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ ఇమామ్ ని మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాందాస్ ని గ్రామస్తులు మరియు ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు అభినందించినట్లు తెలిపారు.