నైనాల పంచాయతీ కార్యదర్శికి సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం
సీపీఐ(ఎం) సీనియర్ నాయకుల పెరుమాండ్ల బాబు గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
నైనాల గ్రామంలోని పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆ గ్రామపంచాయతీ కార్యదర్శి గడ్డి అశోక్ కు సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పెరుమాండ్ల బాబుగౌడ్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సమీపం నుండి వెంకటేశ్వర స్వామి వైపు వెళ్లే అంతర్గత రోడ్డు పూర్తిగా వర్షాకాలంలో మునిగిపోయి కుంటలా ఏర్పడుతుంది అని అన్నాడు. దీనివలన సిసి రోడ్లు మట్టి కూపంగ మారి బాటాచారులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు ఆవేదన వ్యక్తం చెందారు.
గ్రామంలోని మంచి నీటి సరఫరా లీకేజీ పైపు లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేయించాలి అని డిమాండ్ చేశారు. బతుకమ్మ స్థలం నుండి కట్ట క్రింది నుండి ఒకటవ తూమువరకు పాత దారిని సమానంగా చేసి సీసీ రోడ్డు నిర్మించి శాశ్వత బతుకమ్మ స్థలాన్ని ఏర్పాటు చేయాలి అని కోరారు. ఐదవ వార్డులో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకొని నాణ్యమైన స్వశిత విద్యుత్ దీపాలను తక్షణమే ఏర్పాటు చేయాలి. నాలుగో వార్డ్ లో గల లూస్ కరెంటు తీగలు ఉన్నందున అదనంగా విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలి.
మూడో వార్డు చెరువు కట్టుకు వెళ్లే అంతర్గత రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మించాలి .గ్రామంలో గల డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన ప్రభుత్వ భూమిని కాపాడి అన్యకాంతమైన భూమిని కొలిపించి ప్రభుత్వం స్వాధీనం పరుచుకోవాలి. ఇంటి స్థలం లేని నిరుపేదలకు భూమిని పంచాలి. విష జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా బ్లీచింగ్ పౌడర్ ను పిచికారి చేయాలి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రజలను ఎందుకు పట్టించుకోవడంలేదని అని అడిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సమస్యలను పరిష్కరించాలి. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి బాణాల యాకన్న నరసయ్య శ్రీనివాస్ గుట్టయ్య సురేష్ నరసింహాచారి వెంకన్న కొమురయ్య బిక్షం ఉపేందర్ అనిల్ సమ్మయ్య పుల్లయ్య వీరస్వామి బత్తిని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.