Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల అభివృద్దిపై దృష్టి పెట్టండి..

మండల అభివృద్దిపై దృష్టి పెట్టండి..

- Advertisement -

మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం
నవతెలంగాణ – చండూరు

నూతనంగా ఏర్పడ్డ గట్టుప్పల్ మండలానికి  ఏం అవసరం ఉందో అభివృద్ధి  మీద దృష్టి పెట్టాలని చండూర్  మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. మంగళవారం గట్టుప్పల మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  గట్టుప్పల్ అభివృద్ధిపై తెలిసి తెలియని సోయలేనోళ్లు చర్చకు రామ్మనీ అంటే నవ్వొస్తుందన్నారు. గత బి ఆర్ ఎస్ హయాంలో మంజూరైన పనులే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. దానికి తోడు మంజూరైన పనులను రద్దుచేసి మండల అభివృద్ధి విషయంలో వెనుకకు నెట్టారన్నారు. దాని నిర్మాణానికి స్థలం సేకరణ చేయడంలో మా పాత్ర ఉందన్నారు. సబ్ సెంటర్కు మరో 20 లక్షల రూపాయలు, వాయులపల్లి నుండి గట్టుప్పల్ వరకు బిటి రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల యాభై లక్షలు రూపాయలు మంజూరు చేసి ప్రోసిడెంట్ తెప్పించమన్నారు.

రిస్క్ తీసుకొని మంజూరు చేయించిన రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. అంతంపేట నుండి గట్టుప్పల్ రోడ్డు నిర్మాణం, గట్టుప్పల్ నుండి పొటపాక వరకు బీటి రోడ్డు రెన్యూవల్, ఇది కూడా నుండి గట్టుపల్ వరకు సిఆర్ఎఫ్ ద్వారా 30 కోట్ల మంజూరు. గట్టుప్పల్ నుండి లచ్చమ్మ గూడెం వరకు డబ్బులు రోడ్డు నిర్మాణం మంజూరు చేపిస్తే ఈఎంసి దగ్గర పెండింగ్లో ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న రజకుల కొరకు పది లక్షల నిధులతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపించామన్నారు. 3 వందల మగ్గాలు పంపిణీ చేశామని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు పెండింగ్లో ఉన్న మగ్గాలకు దిక్కు లేదని హేళన చేశారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా 12 లక్షల వ్యాయాయంతో రెండవ స్మశాన వాటికను తీసుకొచ్చిన ఘనత నాదేనన్నారు. 10 లక్షలతో సొసైటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ముందడుగు వేశానన్నారు. 12 లక్షలు రెండవ స్మశాన వాటిక నిర్మాణ శంకుస్థాపన బండను పీకేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర మీకేం విలువ ఉందో చెప్పాలన్నారు. ఏమి ఉపయోగం లేని మీరు గట్టుపల్  అభివృద్ధి పని విషయంలో ఏ ఒక్క పనిలో కూడా నా పాత్ర ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాని మీరు ఉండడం వల్ల ఏమి ఉపయోగం అన్నారు. మన ఊరు మనబడి పథకం ద్వారా ఆరు లక్షల మంజూరు అయితే వచ్చే బిల్లులను ఆపి ఉన్న బడిని కూలగొట్టమంటుండు ఎమ్మెల్యే అని అన్నారు. కూలగొట్టే పని తప్ప అభివృద్ధి చేసే పని ఏమీ లేదని అన్నారు.

ఈ సమావేశంలో వైస్ ఎంపిపి అవ్వారి శ్రీనివాస్ ,తేరటుపల్లి  మాజీ ఎంపీటీసీ  గొరిగె సత్తయ్య,  కర్నాటి అశోక్,  మాజీ సర్పంచులు
పోరెడ్డి ముత్తారెడ్డి, తోటకూర శంకర్ ,బిఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షులు, ఐతరాజు హనుమంతు అంతంపేట గ్రామ శాఖ  అధ్యక్షుడు  చిలుకూరి అంజయ్య వార్డు సభ్యులు ,పున్న కిషోర్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు,గంజి కృష్ణయ్య శివాలయ దేవాలయ అధ్యక్షుడు, భానావత్ ఘాశీరాం సింగిల్ విండో డైరెక్టర్, కర్నాటి శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు ఘట్టుప్పల చేనేత సంఘం దోర్నాల అమరేందర్, డైరెక్టర్ ధనలక్ష్మీ సంఘం కర్నాటి అబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -