నవతెలంగాణ – రాయపర్తి
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని, అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సాకారం అవుతుందని అని వర్ధన్నపేట ఐసిడిఎస్ సిడిపిఓ డెబోరా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కొత్త రాయపర్తిలో అంగన్వాడి కేంద్రంలో పోషకమాస వారోత్సవాలను నిర్వహించారు. చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషక ఆహారంపై అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తుకు దేశ సంపద నేటి చిన్నారులే అని తెలిపారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాయి అన్నారు. వెనుకబడివారు, పేదరికం, వలసలు, నిరక్షరాస్యత కారణంగా గర్భిణులు, బాలింతలు తగిన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోలేక పోతున్నారు అని బాధపడ్డారు. దీంతో ఎందరో రక్తహీనతతో బాధపడుతున్నారు అని వివరించారు. అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాధవి లత, అంగన్వాడి టీచర్లు ఐత కృష్ణవేణి, విజయ రాణి, శశిరేఖ, చంద్రకళ, కవిత తదితరులు పాల్గొన్నారు.