- Advertisement -
- – సిమెంటుతో గుంతలను పూడ్చిన మాజీ సర్పంచ్
- – హర్షం వ్యక్తం చేసిన పలువురు గ్రామస్తులు
- నవతెలంగాణ-బెజ్జంకి
- ఎన్నికల సమయంలో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని..వెన్నంటేవుండి ప్రజా సమస్యల పరిష్కారించేల శక్తివంచన తొడ్పాడుతానని పపలువురు హామీలిచ్చి పట్టించుకొకుండా ఉన్నవారు కొకల్లున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు పారిశుద్ధ్య, అభివృద్ధిలో కుంటుపడ్ఠాయి. వ్యవస్థ మర్చినా..ఓ మాజీ సర్పంచ్ మాత్రం మరువకుండా తనవంతుగా ప్రజా సమస్యల కోసం కృషి చేస్తున్నాడు. మంగళవారం మండల కేంద్రంలో రొడ్డుపై ఏర్పడిన గుంతలను మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య తన స్వంత ఖర్చులతో సిమెంటుతో పూడ్చారు. మాజీ సర్పంచ్ తీరుపై పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
సుందరీకరణకు మాజీ సర్పంచ్ శ్రీకారం..
మండల కేంద్రంలోని రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ల సుందరికరణకు మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య తన స్వంత ఖర్చులతో శ్రీకారం చుట్టాడు. గ్రామాల్లో ప్రజల జీవన విధానంపై చిత్రాలను రూపొందించినున్నట్టు మాజీ సర్పంచ్ నర్సయ్య తెలిపారు.
- Advertisement -